తిరుమలకు వెళ్లకపోవడం ఉత్తమం

57చూసినవారు
తిరుమలకు వెళ్లకపోవడం ఉత్తమం
తిరుమలలో భక్తుల వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం శిలా తోరణం వరకు క్యూలైన్ ఉంది. శ్రీవారి దర్శనానికి రోజుకు 80వేల నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు. వీరు కాకుండా ముందు రోజు వచ్చి కొండపై ఉన్నవారూ ఉంటున్నారు. దీంతో కొండపై అన్ని గదులు నిండిపోయాయి. సత్రాలు కూడా ఖాళీగా లేవు. కొందరు కొండపైకి దర్శనానికి వచ్చి రెండు, మూడు రోజులు ఉంటున్నారు. ఈ సమయంలో దర్శనం చేసుకోకపోవడం ఉత్తమమని టిటిడీ అధికారులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్