అద్భుతం.. చనిపోయిన తల్లి గర్భంలో సజీవంగా బిడ్డ

576చూసినవారు
అద్భుతం.. చనిపోయిన తల్లి గర్భంలో సజీవంగా బిడ్డ
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేసింది. దీంతో అల్-కుర్ద్ అనే గర్భిణీ తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చేరాక ఆమె చనిపోయింది. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఆమె గర్భంలో బిడ్డ హార్ట్‌బీట్‌ను వైద్యులు విన్నారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిశువు ఇంక్యుబేటర్‌లో ఉన్నాడు. బిడ్డ బ్రతకడం అద్భుతమని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్