గెలాక్సీలోని అతి పెద్ద నక్షత్ర సమూహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ నక్షత్ర సమూహాన్ని కనుగొన్నారు. భూమికి 12వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న దీనిని ‘వెస్టర్‌లండ్ 1’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. దీని ద్రవ్యరాశి సూర్యుడి కంటే 50 వేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ. ఈ సమూహంలోని కొన్ని నక్షత్రాలు సూర్యుడితో పోలిస్తే పెద్దవిగా ఉంటాయని, 1 మిలియన్ రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.