భయమే పాప ప్రాణం తీసింది

1085చూసినవారు
భయమే పాప ప్రాణం తీసింది
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భీంగల్ మండలంలోని పురానిపేట్ గ్రామానికి చెందిన బ్రమ్మా రౌతు సంతోష్ పెద్ద కుమార్తె కల్పిత(9) శనివారం ఇంటి దగ్గర నిలిపి ఉన్న ట్రాక్టర్ పై ఎక్కి ఆడుకుంటుంది. ఆకస్మాత్తుగా ట్రాక్టర్ స్టార్ట్ చేసి వెళ్తుండగా ట్రాక్టర్ వెళ్లిపోతుందని భయపడ్డ బాలిక ట్రాక్టర్ పై నుండి కిందికి దూకింది. కింద పడ్డ బాలిక పై నుండి ట్రాక్టర్ టైర్ పోవడంతో కల్పిత అక్కడికక్కడే మృతి చెందింది.