ఓ వినియోగదారుడు ఎస్‌బీఐ బ్రాంచ్‌లో సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహించి ఖాళీ క్యాబిన్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై బ్యాంకు ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా కారణాల వల్ల ఫోటోలు తీయడం నిషిద్ధమని హెచ్చరించింది. బ్రాంచుల్లో సిబ్బంది లంచ్ సమయాలు మారుతుంటాయని వివరించింది. ఈ ఘటన తాజాగా రాజస్థాన్‌లో జరిగింది. ఓ వ్యక్తి ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లగా అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురై ఫోటోలు తీసి పోస్ట్ చేశాడు.