రక్తహీనతతో బాధపడేవారికి బెల్లం టీ బెటర్

69చూసినవారు
రక్తహీనతతో బాధపడేవారికి బెల్లం టీ బెటర్
సాధారణంగా చాలామంది టీలో పంచదార వేసుకుంటారు. కానీ టీలో బెల్లం వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లం టీని తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది. అయితే రోజూ బెల్లం టీ తాగితే జీర్ణవ్యవస్థకి మంచిదే. కానీ, తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్