జగిత్యాల రూరల్ మండల సోమన్ పల్లి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30మంది యువకులు బి అర్ ఎస్ పార్టీ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ సమక్షంలో పార్టీలో చేరగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. అనంతరం గ్రామంలో ఎస్సీ కాలనీలో 10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన, గ్రామంలో ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహయనిధి ద్వారా మంజూరైన 30 వేల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ సింగం అరుణ అంజన్న, ఉప సర్పంచ్ గంగాధర్, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ఎంపిడిఓ రాజేశ్వరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.