జియో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జియో టెలికాం, ఏయిర్ ఫైబర్, బ్రాడ్ బ్రాండ్ వంటి ఇంటర్నేట్ సేవలు అందిస్తున్న జియో.. తాజాగా యూపీఐ సేవలు అందించేందుకు రంగం సిద్దం చేసింది. భారతీయులకు ఆన్లైన్ పేమెంట్స్ సేవలను సులభతరం చేసిన యూపీఐ సేవల్లోకి అడుగుపెట్టుడుతున్నట్లు జియో ప్రకటించింది. ఇక జియో రాకతో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలు కూడా త్వరలో గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశముంది.