మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ వేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. డిస్టిలరీస్‌తో టెండర్ కమిటీ సంప్రదింపులు జరిపి ఎంఆర్‌పీ రేట్లు నిర్ణయిస్తుందన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇప్పటికే క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అత్యంత పారదర్శకంగా దుకాణాలు కేటాయించి మద్యం విక్రయాలు ప్రారంభించామన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లోనే 340 మద్యం దుకాణాల కేటాయింపునకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.