ఉన్నత విద్యామండలిలో వైసీపీ వారికి ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు

67చూసినవారు
ఉన్నత విద్యామండలిలో వైసీపీ వారికి ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు
2019 ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా ప్రచారం చేసిన దినేష్‌రెడ్డికి ఉన్నత విద్యామండలిలో ఉద్యోగం ఇచ్చారు. ఈయన విధులకు సక్రమంగా రాకపోయినా మొదట రూ.లక్ష.. కొన్ని నెలలు ఆ తర్వాత రూ.1.25 లక్షల చొప్పున జీతంగా చెల్లించారు. మాజీ మంత్రి కుమారుడికి సైతం ఉన్నత విద్యామండలిలో ఉద్యోగం కల్పించినట్లు చూపి, నెలకు రూ.లక్ష చొప్పున చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈయన విధులకు రాకపోయినా జీతాలు చెల్లించినట్లు తెలిసింది.