ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు రిజర్వ్

74చూసినవారు
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు రిజర్వ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన కేసుపై డివిజన్ బెంచ్ ముందు వాదనలు ముగిసాయి. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలుపై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరుఫు న్యాయవాది తన వాదనలను కొనసాగించారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్