రోడ్డుపై ఉన్నప్పుడు కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. తాజాగా, అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్న బాలుడు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రోడ్డు పక్కన ఓ వ్యక్తి బైక్‌తో తన కూతురు, కొడుకుతో ఉన్నాడు. అయితే, ఉన్నట్టుండి బాలుడు ఒక్కసారిగా రోడ్డు మీదకు వెళ్లాడు. అదే సమయంలో అటుగా ఓ వ్యాన్ వచ్చింది. బాలుడు దాని దగ్గర వరకు వెళ్లి వెనక్కి తిరగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.