మణిపూర్ హైకోర్టు 8వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ క్రిష్ణకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. మణిపూర్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటిదాకా మణిపూర్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ గురువారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ క్రిష్ణకుమార్ను చీఫ్ జస్టిస్‌గా నియమించారు.