కాకర కాయ జ్యూస్‌తో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది. కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. గుండె సమస్యలు దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేస్తుంది.