అగ్నిపత్ సైనికుడికి సన్మానం

79చూసినవారు
అగ్నిపత్ సైనికుడికి సన్మానం
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామానికి చెందిన జహీదాభి లియాకత్ కుమారుడు మహమ్మద్ అలీ అగ్నిపత్ శిక్షణ పూర్తి చేశాడు. ఆయన స్వగ్రామానికి రావడంతో చిన్నతక్కడపల్లి గ్రామస్తులు మంగళవారం ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరమేష్, రాజు పటేల్, అశోక పటేల్, సంతోష్, హనుమంతు, చందు పటేల్, వెంకట్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్