అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నాయకులు కాశీఫ్, సాజిద్, ఇమ్రాన్ కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నియోజకవర్గ సమస్యలపై వారు చర్చించారు.