కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీపీఎం రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపిఎం గంగరాజు, సీసీ రాజయ్య, ఇన్చార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.