పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీవో

83చూసినవారు
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీవో
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం లో బాగంగా మంగళవారం ఎంపీడీవో బషీరుద్దీన్ పర్యవేక్షణలో చెత్తాచెదారం తొలగింపు మరియు మంచినీటి ట్యాంకుల వద్ద పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా వ్యాధులు రావని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ అంగన్వాడి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.