బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయంగా తన వెంట ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములైన తన కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి మాజీస్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.