యూనిఫామ్ తయారీని పరిశీలించిన ఎంపీడీవో బషిరుద్దిన్

73చూసినవారు
యూనిఫామ్ తయారీని పరిశీలించిన ఎంపీడీవో బషిరుద్దిన్
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫాం తయారీ కేంద్రాన్ని మంగళవారం ఎంపీడీవో బషీరుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు దుస్తులు అందజేయడం జరుగుతుందని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్