మేడారం జాతరకు వచ్చే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ తల్లిని మొదటి మొక్కుల అమ్మగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని మేడారానికి ముఖ ద్వారంగా పేర్కొంటారు. కాకతీయ సైన్యంతో సమ్మక్క చేసిన పోరాటంలో ఆమెకు గట్టమతల్లి అంగ రక్షకురాలుగా, నమ్మిన బంటుగా ఉండేదని చరిత్ర కథలు చెబుతున్నాయి. అందుకే గట్టమ్మ తల్లిని ముందుగా దర్శించుకోవాలని భక్తులు భావిస్తారు.