నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: పార్టీ ఇన్ చార్జ్

540చూసినవారు
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: పార్టీ ఇన్ చార్జ్
చందూర్, మోస్రా మండలాలలోని తిమ్మాపూర్, మేడిపల్లి, లక్ష్మీ సాగర్ గ్రామాలలో వడగండ్ల వానకి నష్టపోయిన పంటలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు పదివేల రూపాయలు అందేలా చేస్తారని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, పాత బాలకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్