బీర్కూర్ పంచాయతీ కార్యాలయ గేటుకు తాళం వేసిన గుత్తేదారు

59చూసినవారు
బీర్కుర్ పంచాయతీ దుకాణాల సముదాయానికి 30 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భవనాలను గుత్తేదారు విజయ్ నిర్మించగా, 10 లక్షల బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలియజేశారు. కాంట్రాక్టర్ విజయ్ డిపిఓ శ్రీనివాసరావు ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులు చేయడానికి అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు

సంబంధిత పోస్ట్