నంద్యాల, విజయనగరం జిల్లాల్లో బాలికలపై అఘాయిత్యాలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శైలజ (13) అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది. బాలిక ఒంటిపై గాయాగాయాలు ఉండటంతో నాగరాజే హత్యాచారం చేసి పరారైనట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.