ఎడపల్లి మండల కేంద్రంలో ఏ. ఆర్. పి. క్యాంప్ గ్రామం కొత్త బాద్ కు చెందిన జెజ్జరి శివరాజు అనే వ్యక్తి పక్షుల దాహార్తి, ఆకలి తీర్చడానికి ఓ చిన్న ప్రయత్నం చేసాడు. ఈ ఎండ కాలం లో పక్షులు ఆకలి, దాహార్తి తో అలమటిస్తాయని తెలిసి వాటి గోస చూడలేకపోయాడు. ఓ ఖాళీ అయిన నూనె డబ్బను తీసుకొని దానిని నాలుగు వైపుల కత్తిరించి మధ్యలో నీటిని పోసి, ప్రక్కలకు ధాన్యాన్ని వేసి ఉంచాడు. దానిని తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశాడు. ఇంకొకటి తన పొలం వద్ద ఏర్పాటు చేశాడు. అతను చేసిన పనికి గ్రామస్థులు పలువురు మెచ్చుకున్నారు.