నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ను బుధవారం సన్మానించారు. గణేష్ నిమజ్జన శోభ యాత్రకు సహయ సహకారాలు అందించినందుకు కమిటీ సభ్యులు సబ్ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. సబ్ కలెక్టర్ కు శాలువా కప్పి ప్రసాదం అందజేశారు.