ఉమ్మడి జిల్లాలో వైభవంగా దీపావళి సంబరాలు

78చూసినవారు
ఉమ్మడి జిల్లాలో వైభవంగా దీపావళి సంబరాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు గురువారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున హారతి కార్యక్రమం ఆడబిడ్డలు కుటుంబ సభ్యులకు ఇచ్చి కానుకలు పొందారు. అనంతరం తీపి వంటలు (పేనీలు) తిని టపాకాయలను పేల్చారు. చిన్నారులు కాకర వత్తులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం లక్ష్మి పూజలు చేయడానికి వ్యాపారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్