కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ జాతీయ జెండాను ఎగరవేశారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన అమరుల త్యాగాలు మరువలేనివి అన్నారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, క్రమశిక్షణతో కళాశాలకు రావాలని సూచించారు.