బీటీ రోడ్ల వ్యవస్థతో గ్రామాలకు మహర్దశ: ఎమ్మెల్యే షిండే

3794చూసినవారు
బీటీ రోడ్ల వ్యవస్థతో గ్రామాలకు మహర్దశ: ఎమ్మెల్యే షిండే
గ్రామాలు అభివృద్ధికి రహదారులు ఎంతగానో ఉపయోగపడతాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బుధవారం పెద్ద తడుగురు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ బీటీ రోడ్ల వ్యవస్థతో గ్రామాలకు మహర్దశ అన్నారు. పెద్ద తడుగుర్ నుండి మద్నూర్ వరకు బిటి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అక్కడ అక్కడ పనులు నెమ్మదిగా కొనసాగడం వలన ఇక్కడి గ్రామ ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండటంతో ఎమ్మెల్యే షిండే కాంట్రాక్టర్ కు త్వరగా పూర్తి చేయలని ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యమైన పనులు నిర్వహించి మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఎమ్మెల్యే తో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ జడ్పీటీసీ బస్వరాజ్ పటేల్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, చిన్న శక్కర్గ సర్పంచ్ గఫ్ఫార్ పటేల్, బంటు పటేల్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్