మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పిట్లం మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్(35) బాచుపల్లి నుండి మద్దెల చెరువు వెళుతుండగా మార్గమధ్యలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోకు ఢీకొనడంతో బైక్ వెనకాల కూర్చున్న శ్రీనివాస్ రోడ్డు మీద పడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడని పిట్లం ఎస్ఐ రాజు తెలిపారు. మృతుని భార్య అయిన మంగలి గంగమని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.