ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో నీటి ఎద్దడి ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు మంజూరు చేసారు.
సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో కాంగ్రెస్ మండల పార్టీఅధ్యక్షుడు కురుమ సాయిబాబా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బోర్ మోటారు వేయించారు. నీరు రావడంతో నేటి ఎద్దడి తీరింది.