విద్యార్థులు క్షణికావేశాలకు లోనుకావద్దు

62చూసినవారు
విద్యార్థులు క్షణికావేశాలకు లోనుకావద్దు
విద్యార్థులు క్షణికావేశాలకు లోను కావద్దని మానసిక వైద్య నిపుణుడు రమణ సూచించారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై గురువారం అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని, మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలన్నారు. ఈ యుక్త వయసులో ప్రేమలకు సైతం తావివ్వొద్దని, అవి ఆకర్షణ మాత్రమేనని అన్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు చెప్పిన మాటలు వినాలన్నారు.

సంబంధిత పోస్ట్