గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

61చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని నాగుల్ గ్రామ శివారులో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. శివారు ప్రాంతంలోకి వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. కావాలనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా.? లేక ఎవరైన చంపేసీ ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.