బీర్పూర్: పాఠశాల పరిసరాలు శుభ్రంగా చేసిన మాజీ ఉపసర్పంచ్ హరీష్
బీర్పూర్ గ్రామంలో ఎస్సి కాలనీ సమీపంలోని డిపిఈపి స్కూల్ పరిసరాల్లో గడ్డి, పిచ్చి మొక్కలు ఉండడంతో పిల్లలు స్కూల్ కు వెల్లడానికి ఇబ్బంది పడుతున్నారు. పాములు తిరుగుతుండగా గమనించిన పిల్లలు విషయం టీచర్ కు తెలియజేయగా, టీచర్ గ్రామ మాజి ఉప సర్పంచ్ కు తెలిపారు. స్పందించిన ఉప సర్పంచ్ హరీష్ శుక్రవారం తన స్వంత ఖర్చులతో పిచ్చి మొక్కలను, గడ్డిని శుభ్రం చేయించారు.