కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక
ధర్మారం మండలం చింతలపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. కాపు సంఘం అధ్యక్షులుగా నారా లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా నారా శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా చిందం మల్లేశం, కోశాధికారిగా అవుదరి సంతోష్, జాయింట్ సెక్రటరీగా కందునూరి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా అవుదరి తిరుపతి, కత్తెరసాల రాజిరెడ్డి, కందునూరి శ్రీకాంత్, గంగయ్య, మల్లయ్య, గణేష్, ప్రవీణ్, తిరుపతి ఎన్నికయ్యారు.