May 15, 2024, 10:05 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
May 15, 2024, 10:05 IST
ఎలిగేడు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డి జయంతి సందర్బంగా ఎలిగేడు, నారాయణపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ నాయకులు, గీట్ల అభిమానులు దుస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మడ్లపల్లి భారతి అంజయ్య బాసంపల్లి కొండయ్య ఎలిగేడు సింగిల్ విండో మాజీ చైర్మన్ నరహరి సుధాకర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ గుడుగుల మహేందర్ పాల్గొన్నారు.