May 10, 2024, 05:05 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
కామన్ బస్ స్టాప్ వద్ద బస్ షెల్టర్ నిర్మించండి..
May 10, 2024, 05:05 IST
పెద్దపల్లి పట్టణం నుండి కరీంనగర్ కేంద్రానికి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్తుంటారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కామన్ చౌరస్తా బస్ స్టాప్ వద్ద బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఎండలకు, వర్షానికి ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, పట్టణ వాసులు కోరుతున్నారు.