ఉత్తర భారతంలో కాంగ్రెస్ ప్రభంజనం మరోసారి కొనసాగుతుందని వయనాడ్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అఖండ మెజారిటీతో విజయం సాధించడమే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం రాబోతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో రెండోసారి ఇండియా కూటమి అధికారంలోకి రావడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేశారని తెలిపారు.