మల్లాపూర్ లో ఘనంగా బోనాల పండగ

73చూసినవారు
మల్లాపూర్ లో ఘనంగా బోనాల పండగ
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా దుర్గాదేవికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మండల కేంద్రంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో గ్రామంలోని పుర వీధుల గుండా, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి దుర్గా దేవికి బోనాలను సమర్పించారు. అమ్మవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్