కన్నాపూర్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

79చూసినవారు
శంకరపట్నం మండలం కన్నాపూర్ లో ఆదివారం శ్రీ పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బోనాల సంధర్భంగా గ్రామంలో మహిళలు ఉదయాన్నే నియమనిష్టలతో భోజనం వండుకుని నెత్తిన బోనంతో డప్పు చప్పులతో శివసత్తుల నృత్యాలతో గుంపుగా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకొని నైవేద్యం పూలు పండ్లు సమర్పించారు. పాడి పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో గ్రామం చల్లగా కాపాడమ్మా అని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్