మానకొండూరులో యువకుడు మిస్సింగ్
మానకొండూరు మండలం మెట్ పల్లికి చెందిన క్యాదాసి సంపత్ గత నెల 17న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. దీనితో అతని భార్య స్రవంతి శుక్రవారం సంపత్ కనపడడంలేదు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.