ఏకకాలంలో రుణమాఫీ హామీ ఏమైంది: కృష్ణా రెడ్డి

76చూసినవారు
ఏకకాలంలో రుణమాఫీ హామీ ఏమైంది: కృష్ణా రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన రైతులందరికి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిమ్మాపూర్ మండలంలో మంగళవారం సభ్యత్వ నమోదు-2024 కార్యశాల నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతీ బూత్ లో 200 పైగా సభ్యత్వాలను చేసి పార్టీని బలోపేతం చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. ఎక్కువ మొత్తంలో సభ్యత్వం చేసి త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్