పీహెచ్‌సీని తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్

66చూసినవారు
పీహెచ్‌సీని తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్
రామగిరి మండలం బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రం పరిధిలో డెలివరీలు పెంచాలని, ఎన్సీడీ, ఆభ కార్డులు ఈనెల 31లోపు పూర్తి చేయాలని, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల ఇన్‌చార్జ్ డిసిఓ శ్రీమాల, రామగిరి తహశీల్దార్ రాంచందర్ రావు, ఎంపీడీవో శైలజ, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్