నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

75చూసినవారు
నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా 1 నుండి 19 వయస్సు గల పిల్లలకు మాత్రల పంపిణీని ఎంపిటిసి కొట్టే సందీప్‌ ప్రారంభించారు. పిల్లల ఆరోగ్యం కోసం ఆల్బెండజోన్‌ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నులిపురుగుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఏఎన్‌ఎంలు తార, తిరుమల, ఆశా వర్కర్లు విజయ, స్వప్నలతోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్