
మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యం: కలెక్టర్
కుటుంబం, దేశాభివృద్ధికి మహిళా సాధికారత ఎంతో అవసరమని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో మహిళా సాధికారత పోస్టర్ ను ఆవిష్కరించారు. కుటుంబ అభివృద్ధి మహిళల చేతిలోనే ఉంటుందని, మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు.