పెద్దపల్లి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 18 పరీక్ష కేంద్రాల్లో జరిగిన గ్రూప్2 పరీక్షలో 9018 మంది అభ్యర్థులకుగాను ఉదయం పూట 4410 మంది హాజరు కాగా, 4608 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారని, మధ్యాహ్నం పరీక్షకు 4450 మంది అభ్యర్థులు హజరు కాగా, 4568 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారని పేర్కొన్నారు.