AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అన్‌లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఆదివారం రూ.4కే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ప్రకటించడంతో జనం భారీగా తరలివచ్చారు. ఒకరికి ఒక ప్యాకెట్ మాత్రమే అని చెప్పడంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ క్యూలో నిలబడ్డారు. దాంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.