AP: కృష్ణా జిల్లాలోని 108 వాహనాల్లో ఖాళీగా ఉన్న ఈఎంటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 కంకిపాడు డివిజన్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ, బీ ఫార్మసీ కోర్సులు చదివిన వారు అర్హులన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 16న 89191 97050, 98488 47042, 70931 23579 నంబర్లకు సంప్రదించి వాట్సాప్‌లో ధ్రువీకరణ పత్రాలు పంపాలని సూచించారు.