AP: కడప కార్పొరేషన్ పరిధిలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వీరిలో ఒకరు మాజీ ఉప ముఖ్యమంత్రికి వరుసకు సోదరుడవుతారు. మరో మహిళా మైనారిటీ కార్పొరేటర్ కూడా పార్టీ మారుతున్నారు. మిగిలిన వారిలో ఐదుగురు చిన్నచౌకు, ఒకరు రవీంద్రనగర్‌కు చెందిన వారు ఉన్నారు. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినా కార్పొరేటర్లు మాట వినలేదు.