నూతన విద్యావిధానం చాలా చారిత్రాత్మకమం : ఎమ్మెల్సీ అభ్యర్థి డా.వి. నరేందర్ రెడ్డి

83చూసినవారు
నూతన విద్యావిధానం చాలా చారిత్రాత్మకమం : ఎమ్మెల్సీ అభ్యర్థి  డా.వి. నరేందర్ రెడ్డి
విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయని ప్రత్యేకంగా నూతన విద్యావిధానంలో చాలా చక్కటి మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా అందరికి విద్య అందేటట్లుగా ప్రణాళికను రూపొందించాలని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్,డిగ్రీ మరియు పీజీ కళాశాలల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ సౌజన్యంతో నిర్వహించినటువంటి నూతన విద్యా విధానం సెమినార్ కు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నేడు సమాజంలో అన్ని రంగాలలో చాలా మార్పులు వస్తున్నాయని ప్రత్యేకంగా విద్యా రంగంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవడమే కాకుండా వాటిని అమలుపర్చి అత్యుత్తమంగా ఉద్యోగంలో కొనసాగి ఆదర్శంగా నిలువాలని సూచించారు. ప్రతి ఒక్కరు మార్గదర్శకాలను పాటించి విద్యార్థులకు చాలా చక్కగా భోదించి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతగానో ఉందని గుర్తు చేశారు. రాబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేస్తున్న తనకు పట్టభద్రులందరూ ఐక్యంగా ఉండి మద్దతు ఇవ్వాలని కోరారు. అధ్యాపకులకు ఎదురవుతున్న పలు సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you